Breaking News

అప్పయ్య దీక్షితులు

దాక్షిణాత్య సంస్కృత పండితులలో ప్రముఖులు అప్పయ్యదీక్షితులు. ఈయన భారద్వాజ గోత్రీకుడైన రంగరాజాధ్వరి పుత్రుడు. కాంచీపురమందలి అదెహోల గ్రామమందు, పెనుగొండ వేంకటపతి రాయల ఆస్థానంలోను, మధురానగర తిరుమ నాయకుని ఆస్థానంలోను, నెల్లూరు చిన్నబొమ్మని ఆస్థానంలోను కొంతకాలం ఉన్నట్లు పండితుల అభిప్రాయం.
ఈయన సుమారుగా 104 గ్రంథాలను వ్రాశారని ప్రసిద్ధి. సిద్ధంత లేశ సంగ్రహం, నయమంజరి, న్యాయరక్షామణి (బ్రహ్మసూత్ర భాష్యం), శివార్కమణి దీపిక (శ్రీకంఠభాష్య వ్యాఖ్య), రత్నత్రయ పరీక్ష, శిఖరిణీమాల, మయుఖావళి, విమతఖండనము, మధ్యతంత్రముఖ మర్దనము, మధ్వవిధ్వంసనము (వ్యాఖ్య), యాదవాభ్యుదయ వ్యాఖ్య, హరివంశసార చరితావ్యాఖ్య రామాయన సారస్తవము, భారతతాత్పర్య సంగ్రహం, వృత్తివార్తికము, కువలయానందము, చిత్రమీమాంస అనే వేదాంత, దార్శనిక కావ్య, అలంకార గ్రంథాలను వ్రాసిన శైవమతానుయాయి, మహాపండితుడు అప్పయ్యదీక్షితులు.

No comments